మొక్కల సంరక్షణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు

జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మధుసూదన రాజు

టేకులపల్లి జూలై 7( జనం సాక్షి ): హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మధుసూదన్ రాజు హెచ్చరించారు. గురువారం టేకులపల్లి మండలం లో ఆయన హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. రోల్లపాడు, 9వమైలు తండా బేతంపూడి టేకులపల్లి, గోలియా తండా, ముత్యాలంపాడు క్రాస్ రోడ్, సులానగర్, చింతలంక, బిల్లుడు తండా, గొల్లపల్లి గ్రామపంచాయతీల నందు జరుగుచున్న హరితహారం పనులు రోడ్లు వెంబడి మొక్కలు నాటే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ పరిశీలనలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం త్వరగా పూర్తిచేయాలని, చనిపోయిన మొక్కల స్థానంలో వేరే పెద్ద మొక్కలు నాటించాలని, ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని, మొక్కలను జాగ్రత్తగా కాపాడాలని కార్యదర్శులను ఆదేశించారు. గ తేడాది హరితహారం లో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు చాలా చనిపోవడంతో కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈసారి నాటిన మొక్కలు ఒక్క మొక్క పోయిన కఠిన చర్యలు ఉంటాయని ఎంపీడీవో పర్యవేక్షణ కచ్చితంగా ఉండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దుద్దుకూరు బాలరాజు, ఏపీఓ కాలంగి శ్రీనివాస్, గ్రామ సర్పంచులు జరుపుల బిచా, అజ్మీరా బుజ్జి, లావుడియా శంకర్, కార్యదర్శులు శిరీష, కృష్ణకుమారి, మీనా కుమారి, రవి, కిరణ్, శ్వేత, పవిత్ర, రమాదేవి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.