యువకుడి దారుణ హత్య
కామారెడ్డి,నవంబర్19(జనం సాక్షి): జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బతుకమ్మకుంట కాలనీకి చెందిన తొఫిద్(28) వృత్తిరీత్యా హమాలీ కూలీ. గంజ్ గేజ్ పక్కన పడుకుని ఉన్న తొఫిద్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. బండరాయితో తలపై మోది హత్య చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న డీఎస్పీ లక్ష్మీనారాయణ, పట్టణ ఎస్‌హెచ్‌వో జగదీశ్, ఎస్‌ఐ రవి కుమార్ కలిసి విచారణ చేపట్టారు. మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. తమ కుమారుడిని హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.