రంజాన్‌కు కట్టుదిట్టమైన చర్యలు


ఏర్పాట్లపై సీఎం సమీక్ష
హైదరాబాద్‌, జులై 4 (జనంసాక్షి) :
ముస్లిం పవిత్ర మాసం రంజాన్‌ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జూబ్లీ హాలులో మంత్రులు, పలువురు ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం రంజాన్‌  మాసంలో చేయాల్సిన ఏర్పాట్లపై చర్చలు జరిపారు. బోనాలు, రంజాన్‌ పండగలు కలసి వస్తున్నందున తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు జరక్కుండా చూడాలన్నారు. పోలీసులు తగు చర్యలు తీసుకుని భద్రాతా ఏర్పాట్లు చేయాలన్నారు. రంజాన్‌ మాసంలో ముస్లింలు ఉపవాసాలు ఉండేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. మసీదుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, విద్యుత్‌, తాగునీరు, శానిటేషన్‌ తదితర చర్యలు చేపట్టాలని ఆదేశించారు.