రక్తదానం చేసిన కార్పొరేటర్ హరిశంకర్ రెడ్డి

మేడిపల్లి – జనంసాక్షి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 75‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహా’ వేడుకలలో భాగంగా బుధవారం రక్తదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి బ్లడ్ డొనేట్ చేసి మాట్లాడారు. రక్తదానం ద్వారా మరొకరి ప్రాణాన్ని నిలబెట్టవచ్చని పేర్కొన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆయన కోరారు.