రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు 17.
రక్తదానం చేయడంలో యువకులు ముందుండాలని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు.భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మల్కాజిగిరి ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన 52 మంది యువకులను అభినందిస్తూ పండ్లు,ప్రశంసాపత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ ప్రసాద్, గౌతంనగర్ డివిజన్ కార్పొరేటర్ సునీత యాదవ్,నేరెడ్ మెట్ డివిజన్ కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి,టిఆర్ఎస్ నాయకులు బద్ధం పరశురామ్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి,గుండా నిరంజన్,పిట్ల శ్రీనివాస్,సంతోష్ రాందాస్,బాలకృష్ణ గుప్తా,చెన్నారెడ్డి,సూరి,సత్ యనారాయణ తదితరులు పాల్గొన్నారు.