రాజస్థాన్ దళిత బాలుడు ఇంద్ర కుమార్ మెక్వాల్ హత్యకు నిరసనగా ప్రజాప్రదర్శన నిరసన ర్యాలీ
జనం సాక్షి: నర్సంపేట
రాజస్థాన్ లో జరిగిన ఇంద్ర కుమార్ మెగ్వాల్ హత్యను నిరసిస్తూ ప్రజా ప్రదర్శన నిరసన ర్యాలీకి ముఖ్య అతిథులుగా వచ్చిన దళిత రత్నా కళ్ళపెళ్లి ప్రణయ్ దీప్ ఎంఎస్పి నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జి అందే రవి దళిత బలహీనవర్గాల రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షులు ర్యాలీ ఉద్దేశించి మాట్లాడుతూ
75 ఏండ్ల స్వాతంత్ర్య భారత దేశంలో దళితుల మీద దాడులు దిన దినం మరింత పెరుగుతున్నాయి.
75 ఏండ్లుగా దేశాన్ని పాలించిన పరిపాలకుల స్వార్థం, కులతత్వం, అసమర్థతనే ప్రధాన కారణమని అన్నారు.రాజ్యాంగంలో అంటరానితనాన్ని నిర్ములిస్తూ పొందుపరిచిన చట్టాలను పకడ్బందీగా అమలు చేయకపోవడం వల్లే దళితుల మీద హత్యలు అత్యాచారాలు అకృత్యాలు పెరిపోయాయని అన్నారు.దళితుల మీద దాడులకు పాల్పడే నిందితులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటున్నందుకే స్వేచ్ఛగా హత్యలకు పాల్పడుతున్నారని అన్నారు.రాజస్థాన్ ముఖ్యమంత్రి ఇంద్ర మేగ్వాల్ కుటుంబానికి 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటే ప్రధానమంత్రి మౌనం వహిస్తూ దళితుల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తున్నాడని అన్నారు.ఇంద్ర మేగ్వాల్ ను హత్య చేసిన వారిని జీవిత కాలం జైలులో నిర్బంధించాలని డిమాండ్ చేశారు. కుల వివక్షత నిర్మూలన కోసం, సాంఘిక సమానత్వం కోసం కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని అన్నారు.మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దళితులకు వ్యతిరేక ప్రభుత్వమని, దళితులు హత్యలకు గురైతే కేంద్ర ప్రభుత్వానికి ఏమి పట్టింపు ఉండదని ఇంద్ర మేగ్వాల్ హత్యతో మరోసారి రుజువు అయిందని అన్నారు. ఈ సందర్భంగా ఆగస్టు 23 న రాష్ట్ర విద్యా సంస్థల బంద్ కు పిలుపునిచ్చారు. ప్రజా ప్రదర్శన నిరసన ర్యాలీని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించారు.
ఈ క్రమంలో పాల్గొన్న ఉద్యమ ప్రతినిధులు యాకోబు , రాజు , శ్రీధర్, సాంబయ్య , రాజన్న, రాజశేఖర్, సదయ్య , వేణు చూసిన సుధాకర్ సారంగం మల్లయ్య, రాధిక, నీరజ, సౌజన్య ,అపర్ణ దివ్య సాంబలక్ష్మి స్వప్న , అనుష,
తరుణ్ కుమార్ అనిల్
తదితర పాల్గొనడం జరిగింది.