రాజా రాజేశ్వరి నగర్ లో గంజాయి పై అవగాహన సదస్సు…
బాల్కొండ కమ్మర్పల్లి ఆర్ సి ఫిబ్రవరి 4 జనం సాక్షి
కమ్మర్పల్లి మండలంలో రాజరాజేశ్వరి నగర్ గ్రామంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల ప్రకారం గంజాయి డ్రగ్స్ గుడుంబా తదితర మత్తుపదార్థాల పై గ్రామపంచాయతీ కార్యాలయంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు గంజాయి మత్తు పదార్థాలు సేవించడం వల్ల జరిగే అనర్థాల గురించి అవగాహన కల్పించడం జరిగింది అనంతరం అధికారులు గ్రామంలో గంజాయి సాగు చేయడం గానీ అమ్మడం గాని రవాణా చేయడం గాని సేవించడం గాని జరిగితే కఠినమైన చర్యలు తీసుకుంటామని అవగాహన సదస్సు లో అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అమరగోనె రోజా సదాశివ గౌడ్ ఉపసర్పంచ్ రంజిత కార్యదర్శి శ్రీకాంత్ వార్డ్ సభ్యుల సుమజామహీందర్నర్సయ రామ సుశీల
మరియు ఎక్సయిస్ సీఐ గుండప్ప సిబ్బంది గ్రామ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు