రాజినెల్లి లో మ్యతరి ఆనంద్ అధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

జహీరాబాద్ ఆగస్టు 15 ( జనం సాక్షి) జహీరాబాద్ నియోజక వర్గం కోహిర్ మండలం లోని రాజి నెల్లి గ్రామంలో టి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు మ్యతరి ఆనంద్ అధ్వర్యంలో . అజాదిక అమృత్మహోత్సవన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం 8.15 ని లకు దేశా 75 వ సంవత్సర స్వతంత్ర దినోత్సవంలో భాగంగా కోహిర్ మండలంలోని రాజినెల్లి గ్రామంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించిన కోహిర్ మండల తెరాస సీనియర్ నాయకులు మ్యాథరి ఆనంద్ అనంతరం దేశ స్వాతంత్ర సంగ్రామంలో పోరాట యోధులు, మహాహానియుల పాత్రను కొనియాడుతూ ప్రపంచంలోనే భారత దేశం సంస్కృతి, బిన్నత్వావంలో ఏకత్వానికి ప్రతీక అని, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి జాతీయ జెండా రెపరేపాలడటం సంతోషకారమని, రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్దయెత్తున వజ్రోత్సవా కార్యక్రమలను ఏర్పాటు చేయడం అభినందనీయమని కోహిర్ మండల తెరాస సీనియర్ నాయకులు మ్యాథరి ఆనంద్ కొనియాడారు. అనంతరం అన్నదానం కార్యక్రమం మొక్కలు నాటి నీరు పోశారు.ఈ కార్యక్రమంలో రాజినెల్లి సర్పంచ్ మాగ్దుం పల్లి లచ్చమ్మ, మాజీ అధ్యక్షుడు రచన్న, అనిల్ కుమార్, గొల్ల నర్సింలు యాదవ్, రాజినెల్లి పోస్ట్ మాస్టర్ భాస్కర్, మ్యాథరి లక్ష్మణ్, రాజవర్ధన్ రెడ్డి, బక్కప్ప పటేల్, ఈశ్వరప్ప, రచ్చప్ప, సంసన్ మాజీ సర్పంచ్, ప్రకాష్ ఫస్టార్, మధుకర్ ఫాస్టర్, రాకేష్ ఫాస్టర్, మహేబూబ్ మీయ, బాబా మియా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.