రానున్న పండగల దృష్ట్యా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి
మున్సిపల్ చైర్మన్ కుడుములు సత్యం
ఎల్లారెడ్డి సెప్టెంబర్ 21 జనం సాక్షి : రానున్న బతుకమ్మ, దసరా పండుగల దృష్ట్యా పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ పరిధిలో అన్ని వీధులను పరిశుభ్రం చేయాలని మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో మున్సిపల్ కార్యాలయం ఆయన కార్మికుల హాజరు పట్టికను తనిఖీ చేశారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులను పరిశుభ్రంగా ఉంచాలని, దసరా, బతుకమ్మ పండుగకు అవసరమైన చోట తాత్కాలిక పనులు చేయిస్తామని అన్నారు. పట్టణ ప్రజలు తడి చెత్త, పొడి చెత్త మీ ఇంటికి వస్తున్న వాహనాలోనే వెయ్యాలని, కొంతమంది ప్రజలు రోడ్డుపై వేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. చెత్తను తప్పనిసరిగా చెత్త వాహనంలోనే వేయాలని పట్టణ ప్రజలను ఆయన కోరారు. రానున్న పండగల దృష్టిలో ఉంచుకుని పట్టణంలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని, ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మున్సిపల్ పాలకవర్గ సభ్యుల కు, కమిషనర్ జీవన్ కు తెలపాలని మున్సిపల్ చైర్మన్ కోరారు. కొందరు వ్యాపారులు రోడ్లపైనే చెత్త వేస్తున్నారని గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చిన పాటించడం లేదని అన్నారు. చెత్త రోడ్డుపై వేయడం వల్ల పట్టణ పరిశుభ్రత చెడిపోతుందన్నారు. పట్టణ ప్రగతికి అందరు సహకరించాలని ఆయ న ఆయన వెంట కౌన్స్ లర్ బూమ్ గారి రాము తో పాటు తదితరులు వున్నారు.