రామగుండం టీఆర్‌ఎస్‌లో వర్గపోరు…
గోదావరిఖనిటౌన్, జులై 22 (జనంసాక్షి) : ఉద్యమాల పురిటిగడ్డ అయిన కరీంనగర్ జిల్లాలో రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన రామగుండం నియోజక వర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్టీలో మునుపె న్నడూ లేనిరీతిలో నేతల మధ్య వర్గపోరు మొదలైంది. పార్టీ ఆవిర్భావం నుంచి తీవ్రపట్టుదలతో పనిచేస్తు ఇటీవలి కాలం వరకు నియోజక వర్గ ఇన్‌చార్జీగ బాధ్యతలు చేపట్టిన కోరుకంటి చందర్‌కు, రామగుండంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచిన సోమారపు సత్యనారాయణ తన అనుచర వర్గంతో వర్గపోరుకు ఈ ప్రాంతంలో తెరలేచింది. కాగా, ఎమ్మెల్యే వర్గం, చందర్ వర్గాలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహ రిస్తు పార్టీ కార్యక్రమాలు జరపడం పార్టీ శ్రేణులను తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి ఈ ప్రాంతంలో చురుకుగా పనిచేస్తున్న కోరుకంటి చందర్‌ను నియోజక వర్గ ఇన్‌చార్జీ పదవి నుంచి తొలగించి ఇటీవలి పార్టీలో చేరిన ఎమ్మెల్యేకు నియోజక వర్గ ఇన్‌చా ర్జీగా పార్టీ అగ్రనేతలు బాధ్యతలు అప్పగించడంతో చందర్ వర్గంలో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే తన ఇష్టానుసా రంగా వ్యవహరిస్తు రామగుండం కార్పొరేషన్ పరిధిలో మునుపెన్నడు లేనివిధంగా వార్డుల వారీగా వారి అనుచరులకే బూత్ కమిటీలను ఎన్నుకుని బాధ్యతలు అప్పగిస్తున్నారని చందర్ వర్గం వారు విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ పరంగా నిర్వహించే కార్యక్రమాల్లో సైతం ఈ రెండు వర్గాల నాయకుల ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, పార్టీలో మిగిలిన వర్గాలు చర్చించుకుంటున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య కూడా ఎమ్మెల్యే వర్గమేనని పార్టీశ్రేణులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే టీఆర్‌ఎస్ పార్టీలో చేరడానికి మల్లయ్య తీవ్ర ప్రయత్నాలు జరిపాడని బహిరంగ ప్రచారం. అయితే ఇదంతా బాగానే ఉన్నప్పటికి పార్టీ ఆవిర్భావం నుంచి ఈ ప్రాంతంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన కోరుకంటి చందర్‌ను ప్రస్తుతం బలోపేతానికి కృషి చేసిన కోరుకంటి చందర్‌ను ప్రస్తుతం ఇటు ఎమ్మెల్యే గానీ అటు టీబీజీకేఎస్ అధ్యక్షులు కెంగర్ల మల్లయ్యలు చందర్‌ను పార్టీ నుంచి దూరం చేస్తున్నారనే వాదనలు బలంగా వినవస్తున్నాయి. అయితే ఈ బాగోతం ఇలానే రాబోయే రోజుల్లో కొనసాగితే పార్టీ నుంచి చాలామంది శ్రేణులు బయటకు వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదని రాజకీయ శ్రేణులు భావిస్తున్నారు. ఇదే జరిగితే రామగుండంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీిఆర్‌ఎస్) మనుగడ భవితవ్యం కష్టతర సాధ్యమేనని పలువురు భావిస్తున్నారు.