రావణుడి దిష్టి బొమ్మ దగ్నంతో రగులుకున్న రగడ..

విజయదశమి సందర్బంగా రావణుడి దిష్టి బొమ్మ వివాదం

అర్థరాత్రి రావణుడి దిష్టి బొమ్మ దహనం చేసే నేపథ్యంలో రసభస

రావణుని కాల్చవద్దని తెరాస దళిత సంఘాల నేతల ఆందోళన

అది సంప్రదాయం అని వాదించి కాల్చిన బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా ఇతర నేతలు

ఇరు వర్గాలు స్వల్ప ఘర్షణ, ఇద్దరిపై కేసు నమోదు యాచారం సీఐ కీ స్వల్ప గాయాలు

బిజెపి తీరును నిరశిస్తూ కొప్పు భాష ఫోటోకు చెప్పుల దండ వేసి చావు డబ్బు మోగిస్తూ నిరసన

వర్షంలో సైతం తెరాసా ఎమ్మార్పీఎస్ సాగార్ రహదారి పై రాస్తారోకో

తెరాస సర్పంచ్ బండి మీద కృష్ణ ను ఎమ్మార్పీఎస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు

 

ఏసిపి ఉమామహేశ్వరరావు ఇబ్రహీంపట్నం సీఐ సైదులు ఆందోళన కారులను చెదరగొట్టడంతో సద్దుమణిగిన వివాదం

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 1o(జనంసాక్షి):- విజయదశమి పండగ రోజున రావణుడి దిష్టి బొమ్మ దగ్నం చేసే క్రమంలో వివాదం నెలకొంది వివరాల్లోకి వెళితే.. యాచారం మండల కేంద్రంలో విజయదశమి పండగ సందర్భంగా రావణాసుర దిష్టిబొమ్మ దగ్నం కార్యక్రమాన్ని బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా ఇతర నేతలు ఏర్పాటు చేయడంతో తెరాస దళిత సంఘాల నేతలు గత కొన్ని సంవత్సరాలుగా లేని సంప్రదాయాన్ని ఇప్పుడు ఎందుకు పాటిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనితో వివాదం నెలకొంది రావణుని కాల్చవద్దని ఆందోళన చేపట్టారు రెండు మూడు గంటల వరకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొండటంతో పలుమార్లు పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన వినకపోవడంతో లాఠీలకు పని చెప్పారు. అర్ధరాత్రి కావడంతో అది సంప్రదాయం అని వాదించి రావణాసుర దిష్టిబొమ్మను కాల్చిన బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా ఇతర నేతలు ఇరువర్గాల మధ్య తోపులాట నెలకొనడంతో యాచారం సీఐ ఆందోళనకారులను చదరగొట్టే క్రమంలో స్వల్ప గాయాలయ్యాయి దీనితో పోలీసులు ఆందోళన అదుపు చేసే క్రమంలో ఆందోళనకారులను చదరగొట్టారు ఇద్దరిపై కేసులు నమోదు చేశారు.ఈ తీరును నిరసిస్తూ గురువారం నాడు యాచారం మండల కేంద్రంలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా ఇతర నేతలు తక్షణమే క్షమాపణ చెప్పాలని వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కొప్పు భాష ఫోటోకు చెప్పుల దండను వేసి చావు డబ్బును మోగిస్తూ తెరాస సర్పంచ్ బండి మీద కృష్ణ ను ఎమ్మార్పీఎస్ నేతలు ర్యాలీని నిర్వహించారు దీనితో అప్రపత్తమైన పోలీసులు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా వెంటనే ఆందోళన కారణం అరెస్టు చేసి మాడుగుల పోలీస్ స్టేషన్ కు తరలించారు అనంతరం దళిత సంఘాల నేతలు మహిళలు అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ఏసిపి ఉమామహేశ్వరరావు, ఇబ్రహీంపట్నం సీఐ సైదులు, యాచారం ఎస్సైలు గోపాల్ ,వెంకటనారాయణ, ప్రసాద్ ,శంకరయ్య ,ఆందోళన కారులను అదుపులోకి తీసుకోవడంతో ఆందోళన సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మస్కు నరసింహ, వీహెచ్పీఎస్ నాయకులు కాళ్ళ జంగయ్య ,ఎమ్మార్పీఎస్ నాయకులు చింతుల్ల సాయిలు, తదితరులు పాల్గొన్నారు.