రాష్టాన్న్రి అప్పుల కుప్పగా మారుస్తున్న కేసీఆర్‌

మూడేళ్లలో లక్షాయాభైవేల కోట్ల అప్పా…?

రైతు సమస్యలపై ఆందోళను అడ్డుకుంటారా

ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న టిఆర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదు

-డీసీసీలీగల్‌ సెల్‌ అద్యక్షుడి హెచ్చరిక

కరీంనగర్‌,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): తెలంగాణా రాష్ట్రం గత 50 ఏళ్లలో కేవలం 50వేల కోట్ల అప్పులుంటే టీఆర్‌ఎస్‌ మూడేల్ల పాలనలో లక్షాయాబైవేలకోట్లకు పెంచి అప్పుల రాష్ట్రంగా మార్చాడని, ఇందులో రైతులకోసం వెచ్చించిందెంతో లెక్క చెప్పాలని సీఎం కేసీఆర్‌ను డీసీసీ లీగల్‌ సెల్‌ అద్యక్షుడు ఒంటెల రత్నాకర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక ప్రెస్‌భవన్‌లో డీసీసీ ప్రతినిధులు మాదాసు శ్రీనివాస్‌, బాసెట్టి కిషన్‌, వీరారెడ్డి, రమేశ్‌, కిఫన్‌ చంద్రశేఖర్‌, సతీష్‌, ఖాద్రిలతో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. 90శాతం రైతులతో ఉన్న తెలంగాణా రాష్ట్రంలో రైతులకు మూడున్నరేళ్లలో ఒరుగపెట్టింది ఏంటో చెప్పాలని సవాల్‌ విసిరారు. దేశంలో రైతుల అత్మహత్యల్లో తెలంగాణా రెండవ స్థానంలో ఉన్నా కూడా కనీసం సిగ్గుపడకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా, రుణమాఫీ పూర్తి చేయకుండా కేవలం కాగితాల్లో మాఫి చూపిం చి చేతులు దులుపుకుంటున్నాడని, ఈసమస్యలను అసెంబ్లీ3 దృష్టికి తీసుకెల్లేందుకు పిసిసి చలోఅసెంబ్లీ పిలుపునిస్తే ఎక్కడికక్కడ అరె స్ట్‌లు చేసి పోలీస్‌లను అడ్డం పెట్టుకుని దుర్మార్గంగా వ్యవహరించాడని కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ప్రదాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ ఆందోళన చేస్తే శాంతిభద్రతల సమస్యగా మారుతుందా అని నిలదీశారు., పద్నాలుగేల్లు ఉద్యమ సమయంలో వందలాది ఆందోళనలు చేసినప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఏనాడైనా నిర్బందకాండను అమలు చేసిందా అనిసూటిగా ప్రశ్నించారు. తనమంది మాగ దులకు లాభంచేకూర్చేలా కేవలం ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ కార్యక్రమాలంటూ వేలాదికోట్లను తరలిస్తున్నాడని రాష్ట్రంలో చిన్న కాంట్రా క్టర్‌ ఒక్కడైనా సంతృప్తితో బతుకుతున్నాడా ఆలోచించావా అని నిలదీశారు. చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకునే వారి పోట్టగొట్టి బడా కాం ట్రాక్టర్లకు దోచిపెట్టడానికేనా తెలంగాణా రాష్ట్రం ఇచ్చింది అని నిలదీశారు. ప్రదాన ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని చేస్తున్న కుట్రలో బాగంగానే నిర్బందకాండ కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్షం లేకుండా చేస్తే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదన్నారు. ప్రజాస్వామ్యం నీ జేబు సోత్తు కాదన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమాలు తీవ్రతరంచేసి తగినగుణపాఠం చెప్తుం ద ని రత్నాకర్‌ హెచ్చరించారు.