రీయింబర్స్‌మెంట్‌పై నిరసనల వెల్లువ
కరీంనగర్ టౌన్, ఆగస్టు 9 (జనంసాక్షి) : పేద విద్యార్థులకు, ర్యాంకులు సాధిస్తున్నవారికి ఉన్నత విద్యను దూరం చేయొద్దని డిమాండ్ చేస్తూ గురు వారం ఎస్‌ఐఓ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో తె లంగాణ చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సం దర్భంగా ఎస్‌ఐఓ నగర అధ్యక్షులు రజా తౌసిఫ్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందజేయాలని, ప్రై వేటు కళాశాలల కోరికలకు అనుగుణంగా పేద వి ద్యార్థులకు అన్యాయం చేసేవిధంగా నిర్ణయం తీసుకోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వానికి పేద విద్యార్థుల వారి తల్లిదండ్రుల అవసరాలు కనిపించడంలేదని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విద్యార్థులకు పూర్తిసా ్థయిలో అంచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐఓ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గోదావరిఖనిలో…
పేద విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ రద్దు చేసినం దుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రను మానుకోవాలని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఆధ్వర్యంలో గురువారం స్థానిక మార్కండేయాకాలనీ నుంచి ‘ఖని’ ప్రధాన చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి, మానవహారం చేపట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నేడు వేలాది మంది విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసేందుకు ఆం్షలు విధిస్తుందని, ఇప్పటికే అనేక ఆంక్షలతో 2లక్షల50వేల మంది విద్యార్థులను స్కాలర్‌షిప్‌కు దూరం చేసిందన్నారు. రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రద్దు చేస్తే, దాని ఫలితంగా పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతారన్నారు. పిడిఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శి జూపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాధ్యులు రత్నం రమేష్, మోజేష్, సుధీర్, బాలకృష్ణ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో శవయాత్ర…
ఫీ రీయింబర్స్‌మెంట్ పథకంపై మంత్రివర్గ ఉప సంఘం తీసుకున్న నిర్ణయాలను ఉపసం హరించుకోవాలని రామగుండం కార్పొరేషన్ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం మంత్రివర్గ ఉపసంఘం శవయాత్ర నిర్వహించారు. స్థానిక మార్కండేయకాలనీ నుంచి రాజేష్ థియేటర్ వరకు జరిగిన ఈ కార్యక్ర మంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ బాధ్యులు మోరె గణేష్, గోపు అయిలయ్యయాదవ్, నీరటి శ్రీనివాస్, అనుమ రాయమల్లు, జిమ్మిబాబు, మీసాల కృష్ణ, మోహీద్‌సన్నీ, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎన్టీపీసీలో…
అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబివిపి) ఆధ్వర్యంలో గురువారం ఫీ రీయింబర్స్‌మెంట్ పథకంపై ప్రభుత్వం చేసిన ఆంక్షలను ఎత్తివేయాలని సింధూర ఇంజినీరింగ్ కళాశాల నుంచి ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్డు వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి, రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేష్‌చారీ, రాజశేఖర్, పంకజ్, అభిలాష్, వెంకటేశ్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.