రీయింబర్స్‌మెంట్ కోసం నిరసనల వెల్లువ
గోదావరిఖని, ఆగస్టు 8 (జనంసాక్షి) : రామ గుండం పారిశ్రామిక ప్రాంతంలో ఫీ రీయింబర్స్ మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని బుధవారం పలుపక్షాలు నిరసనను వ్యక్తం చేశాయి. టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. తక్షణం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డి మాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సతీష్, నరేష్, శ్రీకాంత్, వంశీ, శ్రీవాన్, నోవా, ముప్పు సురేష్, కుమార్, సృజయ్, రవి, భరత్, తదితరులు పాల్గొన్నారు. అలాగే పీడీఎస్‌యూ నగరంలో రీయింబర్స్‌మెంట్‌ను రద్దు చేయడం సరికాదంటూ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించింది. స్థానిక మార్కండేయకాలనీ నుంచి ప్రధాన చౌరస్తా వరకు ఈ నిరసన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు జూపాక శ్రీనివాస్, మోజేష్, సుధీర్, రమేష్, రాజ్‌కుమార్, మనోజ్, సంతోష్, సాగర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణు లు సమావేశాన్ని నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌పై తీసుకున్న నిర్ణయంపై వ్యతిరే కతను వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నాయ కులు అయిలయ్యయాదవ్, ఎస్‌కె.అఫ్జల్, అనుమ రాయమల్లు, కృష్ణ, గంగారాజు, మోహీద్‌సన్నీ, మోరె గణేష్, నిమ్మకాయల ఏడుకొండలు, జావీద్, అభిలాష్, రాజు తదితరులు పాల్గొన్నారు. కాగా, విద్యార్థులపై పెనుభారం మోపేందుకు ఫీ రీయిం బర్స్‌మెంట్ ఎత్తివేతకు ప్రభుత్వం కుట్ర పన్ను తుందని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం కార్పొ రేషన్ అధ్యక్షులు నెలకంటి రాము ఆరోపించారు. ఈ విధానాన్ని ప్రభుత్వం విడనాడాలని లేనిపక్షం లో ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
రామగుండంలో…
ఫీ రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం విధించిన ఆం క్షలను నిరసిస్తు టీఆర్‌ఎస్‌వీ శ్రేణులు తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం అందచేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు గుంపుల ఓదేలుయాదవ్, ఎస్.భూషణ్‌హరి, నర్సింగ్, ప్రకాష్, పర్వ తాలు, రవిగౌడ్, రాజు, కె.రమేష్, శంకర్, వంశీ, ఋషిధర్, అనీల్, విజ య్‌కాంత్, గూడూరి లవ న్‌కుమార్, రంజిత్, ఆదిత్య, నరేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
వేములవాడలో…
ఫీజు రీయింబర్స్‌మెం ట్‌పై కోత విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం నాడు స్థానిక టీిఆర్‌ఎస్‌వీ అధ్వర్యంలో తహశీల్దార్ కార్యా లయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వాహించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌వీ నాయకులు మాట్లా డుతూ, నిరుపేద విద్యార్థులు ఉన్నత చదు వులు చదువుకోవడానికి వీలుగా స్వర్గీయ రాజ శేఖర్ రెడ్డి ప్రభుత్వం విద్యార్ధులకు ఫీజు రీయిం బర్స్‌మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అందులో కోత విధించడం వల్ల లక్షలాది పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కావలసివస్తుందని విమర్శించారు. రాష్ట్రం లో ఓ పక్క మైనింగ్ కాంట్రాక్టర్లకు, భూబకా సురులకు, మధ్య దళారీలకు వేల కోట్ల రూపా యలు దోచుకోవడానికి వీలు కల్పించే పథకాలను ప్రవేశపెడుతున్న ప్రభుత్వం దేశాభివృద్ధికి దోహ దపడే ఉన్నత విద్యను అభ్యసించడానికి పేద వి ద్యార్థులు దూరం అయ్యేలా చర్యలు తీసుకుం టున్నదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విధించిన కోతను ఎత్తివేసి, ఎప్పటిలానే విద్యార్థులకు ఫీజు రీఅంబర్స్‌మెంట్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీిఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి వెంగళ శ్రీకాంత్‌గౌడ్, జిల్లా ప్రధాన కార్య దర్శి నిమ్మశెట్టి విజయ్, మండల అధ్యక్షులు సార్ల చారి, కార్యదర్శి రాజశేఖర్, హరీశ్, ప్రశాంత్, శ్యాంసింగ్‌లతో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.