రూ.922 కోట్ల సత్యం ఆస్తుల అటాచ్
ఈడీ చరిత్రలో మొదటిసారి..
హైదరాబాద్, అక్టోబర్ 18 (జనంసాక్షి):
సత్యం కుంభకోణం కేసుకు సంబంధించి రూ.822 కోట్ల ఎఫ్‌డిలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి)జప్తు చేసింది. ఈడి చరిత్రలో దేశంలో ఇంత పెద్ద మొత్తంలో ఆస్తిని జప్తు చేయడం ఇదే ప్రథమం. ఈ మొత్తం సత్యం ఖాతాలోనివి. ఈడి రూ. 822 కోట్లను జప్తు చేసినట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. కాగా అంతకు ముందు రెండు నెలల క్రితం రామలింగ రాజుకు చెందిన రూ.120 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్‌మెంటుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి కోర్టు బుధవారం అనుమతిని ఇచ్చిన విషయం తెలిసిందే. రామలింగరాజు ఆస్తుల అటాచ్‌మెంటుకు అనుమతివ్వాలని సిబిఐ ఇటీవల సిటీ సివిల్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు ఇరువైపుల వాదనల అనంతరం సిబిఐకి అటాచ్‌మెంట్ కోసం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సత్యం రామలింగరాజుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపైన 1063 ఆస్తుసు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటన్నింటి అటాచ్‌మెంట్‌కు కోర్టు సిబిఐకి అనుమతించింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో సత్యం రామలింగరాజు, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఆస్తుల ఉన్నట్లుగా సిబిఐ గుర్తించింది.