రెండు రోజులపాటు గోదావరి మంచి నీతి సరఫరా నిలిపివేత

పినపాక నియోజకవర్గం జులై 14 (జనం సాక్షి): భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తుండటంతో మండల ప్రజలకు మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏరియా డీజీఎం (పర్సనల్) ఎస్ రమేష్  ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మణుగూరు   ఏరియాకు మంచి నీటి సరఫరా చేస్తున్న ఇంటెక్ వెల్ దగ్గర నీటి ప్రవాహంతో ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది.  ఇంటెక్ వెల్ దగ్గర ఉన్న పంపులను నడిపించుటకు సాధ్య పడకపోవడం తో  రెండు రోజుల పాటు ఇంటెక్ వెల్ నుంచి నీటి సరఫరా ను నిలిపి వేశారు. మణుగూరు ఏరియా లో ఉన్న అన్నీ కాలనీలు, గనులు, డెపార్ట్మెంట్స్,  మునిసిపాలిటీ ఏరియా లు పరిసర ప్రాంత గ్రామ పంచాయితీలకు నీటి సరఫరాను రెండు రోజులు నిలిపి వేస్తున్నట్టు తెలిపారు. అంతరాయం వల్ల  ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు పరిసర ప్రాంత ప్రజలు నీటిని పొదుపుగా వాడుకొని సింగరేణి యజమాన్యానికి సహకరించవలసినదిగా కోరారు.