రెండు వేల జనాభా కలిగిన గ్రామాల్లో సేవలు
దక్కన్ గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ రాజారావు
సారంగాపూర్ గ్రామీణం, (జనంసాక్షి) రెండు వేల జనభా కలిగిన ప్రతి గ్రామంలో మినీ శాఖ(అల్ట్రాస్మాల్ బ్రాంచ్) లను ఏర్పాటు చేయనున్నట్లు దక్కన్ గ్రామీణ బ్యాకు రీజినల్ మేనేజర్ బి.రాజారావు పేర్కొన్నారు ఇందులో బాగంగా జిల్లాలో 114 శాఖలను గుర్తించినట్లు తెలిపారు సారంగాపూర్ మండలం బీర్‌పూర్‌లో శుక్రవారం అయన విదేశీ కరెన్నీ బదిలీ సేవలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఖాతాదారుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ఆప్పటికే 66 ప్రధాన శాఖలుండగా అదనంగా మన్నెగూడెం, గంగాధర,మల్యాల, శంకరపట్నం ,కరీంనగర్ లలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు సమావేశంలో బీర్‌పూర్ సారంగాపూర్ నేరెళ్ల శాఖల మేనేజర్లు డి,శ్రీనివాస్ వేణుగోపాల్ సత్యనారాయణరెడ్డి క్షేత్రాదికారి జగదీశ్‌బాబు ,మల్లేశం మాజీ సర్పంచులు రమేష్ ,శంకర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.