రెండేళ్లలో పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి
– ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్,అక్టోబర్3(జనంసాక్షి): బ్జడెట్‌లో నీటిపారుదల ప్రాజెక్టులకే తొలి ప్రాధాన్యమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై శనివారం సీఎం అధికారిక నివాసంలో సవిూక్ష నిర్వహించారు. రెండేళ్‌ల్లో ఈ ప్రాజెక్టు పూర్తి కావాలన్నారు. సత్వరమే పనుఉల చేపట్టి నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. పంప్‌హౌజ్‌లు, కాల్వల పనులు, జలాశయాలు, టన్నెళ్ల పనులు సమాంతరంగా జరగాలని అధికారులు, మంత్రులకు సూచించారు. రంగారెడ్డి జిల్లాకు కూడా ప్రాజెక్టును విస్తరించి నీరివ్వాలని ఆదేశించారు. 2 వారాల్లో సర్వే చేసి డిజైన్లు రూపొందించి టెండర్లు పిలవాలని పేర్కొన్నారు. అధికారులు అలసత్వం చూపకుండా పనిచేయాలన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రతి సోమవారం సమక్షించాలని, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. పాలమూరు ప్రాజెక్ట్‌పై మంత్రులు హరీష్‌రావు, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలతో సవిూక్ష సమావేశం నిర్వహించారు. భూసేకరణ, నష్టపరిహారం, ప్రాజెక్టు విస్తరణపై సవిూక్షించారు.
రెండేళ్లలో పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు పంప్‌హౌజ్‌లు, కాల్వల పనులు సమాంతరంగా జరగాలన్నారు. అదేవిధంగా జలాశయాలు, టన్నెళ్ల పనులు కూడా. ప్రాజెక్టును విస్తరించి రంగారెడ్డి జిల్లాకు కూడా నీరివ్వాలన్నారు. రెండు వారాల్లో సర్వేచేసి డిజైన్లు రూపొందించి టెండర్లు పిలవాలని, . ఎక్కువ ఏజెన్సీలను నియమించి ప్రాజెక్టుల సర్వేలు త్వరగా పూర్తిచేయాలన్నారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును నిరంతరం పర్యవేక్షిస్తానని,. ప్రాజెక్టుపై ప్రతి సోమవారం సవిూక్షించాలన్నారు. బడ్జెట్‌లో నీటిపారుదల ప్రాజెక్టులకే తొలి ప్రాధాన్యంఅంటూ అధికారులు అలసత్వం చూపకుండా పనిచేయాలన్నారు. ప్రాజెక్టులకు వెనువెంటనే బిల్లులు చెల్లిస్తాం. ప్రాజెక్టు పూర్తితో మహబూబ్‌నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయాలని వివరించారు. త్వరితగతిన భూసేకరణ చేసి, రైతుల భూములు, ఇండ్లు, స్థిరాస్తులకు విలువకట్టి వెంటనే పరిహారం చెల్లించాలన్నారు. ప్రతి ఏటా నీటిపారుదల శాఖకు రూ. 25 వేల కోట్లు కేటాయిస్తాం. డిజైన్ల రూపకల్పనలో, ఇతర పనుల్లో అవసరమైతే రిటైర్డ్ ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలి. ప్రాజెక్టుకు అవసరమయ్యే విద్యుత్ సరఫరాకు జెన్‌కో,
ట్రాన్స్‌కోతో సమన్వయం చేసుకోవాలి. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని సీఎం పేర్కొన్నారు.