రెండో టీ ట్వంటీలోనూ ఓడిన ఆసీస్‌

జనవరి 28 – మెల్‌బోర్న్‌ ఃఆస్టేల్రియాతో జరిగిన ట్వంటీ సిరీస్‌ను శ్రీలంక 2-0తో కైవసం చేసుకుంది. చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన రెండో టీ ట్వంటీలో ఆ జట్టు 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యా టింగ్‌కు దిగిన లంక 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. దిల్షాన్‌ 6 , పెరీరా 15 , చంది మాల్‌ 5 పరుగులకు ఔటయ్యారు. ఈ దశలో మహేళా జయవర్థనే , జీవన్‌ మెండిస్‌ ఆదుకు న్నారు. నాలుగో వికెట్‌కు 63 పరుగులు జోడిం చారు. మెండిస్‌ ఔటైనా… జయవర్థనే , పెరీరా ఇన్నింగ్స్‌ కొనసాగించారు. ధాటిగా ఆడుతూ నాలుగో వికెట్‌కు అజేయంగా 59 పరుగుల భాగ స్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో జయ వర్థనే హాఫ్‌ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. శ్రీలంక 20 ఓవర్లలో 3 వికెట్లకు 161 పరుగులు చేసింది. జయవర్థనే 61 , పెరీరా 35 పరుగు లతో నాటౌట్‌గా నిలిచారు. తర్వాత బరిలోకి దిగిన ఆస్టేల్రియా కూడా తడబడింది. తక్కువ స్కోర్‌కే ఓపెనర్లను కోల్పోయింది. అయితే జార్జ్‌ బెయిలీ , షాన్‌ మార్ష్‌ మూడో వికెట్‌కు 86 పరుగులు జోడించారు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ సాఫీగా సాగుతున్న దశలో వరుణుడు అంతరా యం కలిగించాడు. అప్పటికి ఆసీస్‌ స్కోర్‌ 10 ఓవర్లలో 61 పరుగులు. వర్షం తగ్గిన తర్వాత ఆసీస్‌ లక్ష్యాన్ని 15 ఓవర్లలో 122 పరుగులుగా నిర్ణయించారు. బెయిలీ , మార్ష్‌ ధాటిగా ఆడి జట్టును గెలిపించే ప్రయత్నం చేశారు. ఆఖరి ఓవర్‌లో 18 పరుగులు చేయాల్సి ఉండగా… తొలి మూడు బంతులకు ఐదు పరుగులు వచ్చాయి. అలాగే బెయిలీ ఔటయ్యాడు. చివరి మూడు బంతులకు 12 పరుగులు చేయాల్సిన దశలో మార్ష్‌ రెండు ఫోర్లు కొట్టాడు. చివరి బంతికి మాత్రం సింగిలే రావడంతో ఆసీస్‌ విజయానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ విజయంతో టీ ట్వంటీ సిరీస్‌ను లంక 2-0తో సొంతం చేసుకుంది. ఆల్‌రౌండర్‌గా రాణించిన పెరీరాకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది.