రెడ్డిపాలెం గ్రామంలో దుర్గావాహిని శక్తి సాధన కేంద్రం ప్రారంభం.
బూర్గంపహాడ్ ఆగష్టు17 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం రెడ్డిపాలెం గ్రామంలో బుధవారం విశ్వహిందూ పరిషత్ లో యువతుల (అమ్మాయిలు) విభాగం అయిన దుర్గావాహిని శక్తి సాధన కేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అథిదిగా విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అర్చక పురోహిత్ సహ ప్రముఖ్ వోరుగంటి సురేష్ కుమార్ పాల్గొని వారు మాట్లాడుతూ నేటి సమాజంలో ఆడ పిల్లలు ఎలాంటి విపత్కర పరిస్థితులను ఐనా ఎదుర్కొనే విధంగా ఉండాలనీ, లవ్ జీహాద్ లని అడ్డుకునే విధంగా ఉండాలనీ, దానిలో భాగంగానే ఈ రోజు రెడ్డిపాలెం గ్రామంలో విశ్వహిందూ పరిషత్ యువతుల విభాగం అయిన దుర్గావాహిని శక్తి సాధన కేంద్రం ప్రారంభిస్తున్నామని దీని ద్వారా దుర్గావాహిని కార్యకర్తలకు కరాటే, కర్ర సాము, సూర్య నమస్కారాలు, వ్యాయామాలు, యోగాసనాలు నేర్పించబడతాయని, ఈ అవకాశాన్ని మండలంలో ఉన్న దుర్గావాహిని కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు, ప్రతి ఆదివారం సాయంత్రం 5:00 గంటలకు రెడ్డిపాలెం హైస్కూల్ మైదానం లో ఈ శక్తి సాధన కేంద్రం నడుస్తుందని తెలిపారు, ఈ కార్యక్రమం లో విశ్వహిందూ పరిషత్ ఖమ్మం విభాగ్ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్లు, భాగ్యలక్ష్మి విభాగ్ దుర్గావాహిని సంయోజిక రేగడి స్వరశ్రీ, స్థానిక జిల్లా కార్యాధ్యక్షులు అవులూరి శ్రీనివాస రెడ్డి, జిల్లా కార్యదర్శి జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు, జిల్లా సహ కార్యదర్శి గంగాదరి సీత, దుర్గావాహిని జిల్లా సంయోజిక చక్కా కళ్యాణి, దుర్గావాహిని జిల్లా సహ సంయోజిక చక్కా నిహారిక, బూర్గంపహాడ్ ప్రఖండ అధ్యక్షులు కొండపనేని రామారావు, ప్రఖండ సంఘటన కార్యదర్శి తోట లక్ష్మి,10 మంది దుర్గావాహిని కార్యకర్తలు పాల్గొనగా వీరికి శిక్షక్ గా వ్యవరించిన రేగడి స్వరశ్రీ శిక్షణ ఇచ్చారు.