రెవెన్యూ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని కోరిన జడ్పీటీసీ స్వప్న భాస్కర్
జహీరాబాద్ సెప్టెంబర్ 20( జనం సాక్షి) సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ‘ జిల్లా సాధారణ సర్వసభ్య సమావేశం’లో న్యాల్కల్ మండల రెవిన్యూ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని జిల్లా పరిపాలనాధికారి డా..శ్రీ శరత్ ను కోరిన న్యాల్కల్ జడ్పీటీసీ స్వప్నభాస్కర్..ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు ఇబ్బంది కల్గకుండా, అందరికి మేలు జరగాలని మన ముఖ్యమంత్రివర్యులు అవినీతికి తావు లేకుండా ప్రవేశపెట్టినది ‘ధరణి పోర్టల్ ‘..కానీ రెవెన్యూ కార్యాలయంలో డబ్బులిస్తే కానీ పని చేయడం లేదన్నారు..పనికి ఒక రేట్ చొప్పున తన క్రిందస్థాయి సిబ్బందితో కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారని వాపోయారు..సమయానికి రాకుండా, మండలంలోని ప్రజాప్రతినిధులకు మరియు సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కల్గిస్తున్న మండల రెవెన్యూ అధికారిపై తగుచర్యలు తీసుకోవాలని సభముఖంగా కోరారు…కార్యక్రమం లో శాసన సభ్యులు , సిఈఓ ఎల్లయ్య జడ్పీటీసీ సభ్యులు,ఎంపిపి సభ్యులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.