రేషన్ డీలర్లపై కక్ష సాధింపు సహించేదిలేదు
– సమస్యలను వెంటనే పరిష్కరించాలి
– సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి
కరీంనగర్, జూన్30(జనం సాక్షి) : రేషన్ డీలర్లపై కక్ష సాధింపు చర్యలను సహించేది లేదని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి అన్నారు. శనివారం జీవన్‌రెడ్డితో రేషన్ డీలర్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ రాచరిక పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. రేషన్ డీలర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డీలర్ల సమస్యపై న్యాయపరంగా పోరాడుతామని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుండా సస్పెండ్ చేస్తే ఆత్మహత్యలే శరణ్యమని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తీరుతో రాష్ట్రంలోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేవలం రైతుబంధుతో రూ.4వేలు ఇచ్చి దేశంలోనే ఎక్కడా లేని విధంగా పాలన చేస్తున్నామని మంత్రులు చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ఏ ఒక్క వర్గానికి కేసీఆర్ ప్రభుత్వం పూర్తి న్యాయంచేయలేదన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతూ బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పుకోవటం విడ్డూరంగా ఉందని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం రేషన్ డీలర్ల సమస్యలపై తక్షణమే స్పందించి, వాటి పరిష్కారం చూపి వారి ద్వారానే రేషన్ అందించేలా చూడాలని పేర్కొన్నారు. లేకుంటే రేషన్ డీలర్ల పక్షాన పోరాటం సాగిస్తామని జీవన్‌రెడ్డిప /-రభుత్వానికి హెచ్చరించారు.