రైతుబీమాపై అవగాహన కల్పించాలి
జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి
వరంగల్ రూరల్,డిసెంబర్3(జనంసాక్షి): రైతును రాజును చేసి వారి కళ్లలో ఆనందాన్ని చూడడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్‌డ్డి అన్నారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబీమా పథకంపై రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతుబీమా పథకంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యవసాయశాఖ అధికారులు ప్రతి గ్రామాన్ని సందర్శించి రైతులకు సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. ఏఈల పనితీరు అభినందనీయమన్నారు. అంకితభావం, క్రమశిక్షణతో పని చేస్తేనే తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కోతుల బెడదను నియంత్రిస్తామన్నారు. అధికారుల సలహాలను, సూచనలు స్వీకరించి రైతులు ఆర్థికంగా ఎదగాలన్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమం కోసమే దేశానికి ఆదర్శమైన రైతు బంధు, రైతుబీమా వంటి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. రైతుబంధు, రైతుబీమాతో రైతుల కళ్లలో ఆనందం నెలకొందన్నారు. ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు,వ్యవసాయ పనిముట్లను అందజేస్తున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు సాగులో నూతన పద్ధతులు మెళకవలు పాటించాలన్నారు.