రైతులు ధైర్యంగా ఉండాలి….

అన్నదాతలను అందరిని ఆదుకుంటాం..
మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు ..
వరంగల్ బ్యూరో జనవరి 18 ( జనం సాక్షి)
.అకాల వర్షం లో ఆర్థికంగా చితికిపోయిన అన్నదాతలు అందరినీ రాష్ట్ర ప్రభుత్వ ఆదుకుని.

 బాధితులందరికి న్యాయం చేస్తామని, రైతన్నలు ధైర్యంతో ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నదాతకు భరోసా ఇచ్చారు.
మంగళవారం వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా నర్సంపేట మండలం ఇటుక పల్లి, ఇప్పల్ తండా గ్రామాలలో పంటలు నష్టపోయిన రైతులను కలుసుకుని అన్నదాతలకు అభయమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతలు ఆదుకోవాలని దృఢ సంకల్పంతో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతన్న ఆపద్బాంధవుడిగా పేరుగాంచాడు అని ఆయన అన్నారు. ఆపదలో ఉన్న రైతులకు సాయం చేసింది కేసీఆర్  అని ఆయన ప్రకటించారు. జిల్లాలో ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగాముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నామని ఆర్థికంగా ఆదుకొని గ్రామాల వారీగా పారదర్శకంగా సర్వే నిర్వహించి అన్నదాతకు అండగా నిలబడతామని ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు.
మిర్చి రైతుల పరిస్థితి బాధాకరం మనీ నీ లక్షలాది రూపాయలు అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెడితె
చేతికొచ్చిన పంట నేలపాలయ్యింది అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితుల నేపథ్యంలో
రైతులు ధైర్యంగా ఉండాలని అన్నారు. జిల్లాలోని కలెక్టర్లు వ్యవసాయ ఉన్నతాధికారులతో సమగ్రంగా సర్వే చేసి ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేస్తాం మరి మంత్రి తెలిపారు.
పరకాల, నర్సంపేట, భూపాలపల్లి పరిధిలో ఎక్కువ నష్టం జరిగిందని ముగ్గురు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో సమగ్ర సర్వే తోపాటు పంచాయతీల వారీగా పారదర్శకంగా సర్వే నిర్వహించి అన్నదాతలకు అండగా నిలవడమే తమ ఉద్దేశమని ఆయన ప్రకటించారు ఎవరు అధైర్య పడకుండా ఉండాలని అన్నదాతలు కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శంకర్ నాయక్ జెడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీలు, సొసైటీ అధ్యక్షులు పాల్గొన్నారు ‌