రైతులు పంటల సాగు వివరాలు అందించాలి

 నాంపల్లి ఆగస్టు 10 (జనం సాక్షి )రైతులు తాము సాగు చేసిన పంటల వివరాలను సర్వే నెంబర్ వారిగా వ్యవసాయ విస్తరణ అధికారులకు అందుచాలని మునుగోడు వ్యవసాయ సంయుక్త సంచాలకులు ఎల్లయ్య రైతులను కోరారు. బుధవారం మండలంలోని టీపీ గౌరారం, తుంగ పహాడ్ గ్రామాలలో యాప్ ద్వార పంటల వివరాల నమోదును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అంతేకాక రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి విజయ, రైతులు పాల్గొన్నారు.