రైతులు ప్రగతినివేదన సభకు రావాలి
మహబూబ్‌నగర్,ఆగస్ట్28(జనం సాక్షి): నాలుగున్నరేళ్లలో సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభను నిర్వహిస్తున్నామని ప్రణాళఙకా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ సభ ద్వారా నాలుగేళ్ ప్రగతని విరిస్తామని అన్నారు. కు అన్నదాతలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. నాలుగున్నరేళ్ల క్రితం వరకు వ్యవసాయం దుర్భర స్థితిని ఎదుర్కొందని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రారంభం నుంచి అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా ప్రాధాన్యతా క్రమంలో పనులు చేసుకుంటూ వచ్చారని చెప్పారు. అన్నదాతల కోసం ఇంతగా పరతపించిన సీఎం కేసీఆర్ చల్లని చూపు వల్లే నేడు వ్యవసాయ విస్తీర్ణం పెరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఇంతగా ప్రయోజనం పొందిన అన్నదాతలు ప్రగతి నివేదన సభకు ఇంటికొకరు చొప్పున తరలిరావాలని కోరారు. అందువల్ల ప్రగతి నివేదన సభకు భారీగా తరలిరావాలని, అందుకు ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా పని చేయాలని పిలుపు నిచ్చారు. అనేక సంక్షేమ, అభివృద్ధి పనులు జరిగాయని, వీటన్నింటిని ప్రతి కార్యకర్త గ్రామాల్లో జనానికి తెలియ పర్చాలని కోరారు. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి 200 మంది వంతున ప్రగతి నివేదన సభకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.