రైతులు వరిలో తడిపొడి విధానాన్ని అవలంభించాలి…
మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్)
రైతులువరిలో తడిపొడి విధాన్నాన్ని అవలంభించాలని కోర్ కార్బన్ఎక్స్ సొల్యుషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు స్వామి వివేకానంద రూరల్ డెవలప్మెంట్ సొసైటి (SVNRDS) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోర్ కార్బన్ సుస్టైనబుల్ రైస్ ప్రొడక్షన్ సూర్యాపేట జిల్లా మేనేజర్ ఎండీ జిషాన్ అన్నారు. తడిపొడి విధానం అమలుపై మండల పరిధిలోని కప్పలకుంట తండాలో రైతులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తడిపొడి విధానాన్ని అవలంభించడం వల్ల మీథేన్ వాయువు స్థాయి తగ్గి అధిక దిగుబడి పొందవచ్చన్నారు. అంతేకాకుండా భూగర్భజలాలు తగ్గకుండా చూడొచ్చన్నారు. సంస్థ నియమాలను పాటించిన వరిలో ఆరు-తడి విధానం ద్వారా పంట సాగు చేసే రైతులకు పారితోషికంగా ఎకరాకు 400 రూపాయలను రైతులకు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ టీకం నాయక్, ధరావత్ కృష్ణ నాయక్, మండల కోఆర్డినేటర్ లు బానోతు హుస్సేన్ నాయక్,భూక్యా బాబు నాయక్, రైతులు తదితరులు