రైతుల కోసం ఏనాడూ ఆలోచించని కాంగ్రెస్
విమర్శలు చేస్తే నష్టపోయేది వారే
ప్రజలను తప్పుదోవ పట్టించలేరు
ఎంపి వినోద్ స్పష్టీకరణ
కరీనంగర్,మే30(జనం సాక్షి): రైతులకు ముఖ్యమంత్రి కేసిఆర్ చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే…కాంగ్రెస్ నేతల కాళ్ల కింద భూమి కదులుతుందని, అందుకే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని కరీంనగర్ ఎంపి వినోద్ కుమార్ అన్నారు. దేశచరిత్రలో గతంలో ఎప్పుడూ ఇలా రైతుల పక్షాన ప్రభుత్వాలు పనిచేసిన దాఖలాలు లేవన్నారు. బహుముఖ కార్యక్రమాలు జరగలేదన్నారు. రైతుబందు పథకం అమలవుతున్న వేళ కాంగ్రెస్ నేతలు ఒక్కో రకంగా చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. రైతుబంధు పథకాన్ని కాంగ్రెస్ నేతలు రాబంధు పథకంగా అభివర్ణించడంపై ఎంపి తీవ్రంగా మండిపడ్డారు. ఆయన ఆర్‌ఎన్‌ఎ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని పట్టించుకోక, ఈ ప్రాంతాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన ఘనులు కాంగ్రెస్ నేతలని అన్నారు. ఇక్కడి నిధులు, నీళ్లు, నియామకాలు పక్క రాష్ట్రానికి వెళ్తుంటే మాట్లాడకుండా ఉన్నవాళ్లు నేడు రైతు బంధు పథకాన్ని రాబంధు పథకమంటే రైతులే వీరికి బుద్ధి చెబుతారన్నారు. విూరు అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వాలని, విత్తనాలు-ఎరువులు అందుబాటులో ఉంచాలని, భూ రికార్డులు ప్రక్షాళన చేయాలని, రైతులకు పంట పెట్టుబడి కింద ఏటా 8వేల రూపాయలు ఇవ్వాలని, రైతు కుటుంబానికి బీమా కల్పించాలని ఏనాడైనా
ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. నిజంగా ఇలాంటి ఆలోచన చేయడమే గాకుండా అమలు చే/-తున్న ఏకై సిఎం కెసిఆర్ అని అన్నారు. ఆరోజు రైతులకోసం ఏం చేయాలని ఈ కాంగ్రెస్ నేతలు ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ వాళ్లే రాబందులని మండిపడ్డారు. రైతు బంధు పథకం కింద రైతుకు పెట్టుబడి ఇవ్వడం దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ పార్టీ చేయలేదని, ఇంత మంచి కార్యక్రమం రైతులందరికీ ఉపయోగపడేలా అధికారులు, స్థానిక నేతలు, రైతు సమన్వయ సమితి నేతలు సమిష్టిగా పనిచేయాలని కోరారు. అర్హులైన ప్రతి రైతుకు పాస్ బుక్, పంట పెట్టుబడి వస్తుందని హావిూ ఇచ్చారు. భూ రికార్డులను ప్రక్షాళన చేయడమంటే వెన్నులో వణుకుపుడుతుందని, అందుకే ఇప్పటి వరకు ఎవరు దానిని ముట్టుకోలేదన్నారు. అయితే ముఖ్యమంత్రి కేసిఆర్ మాత్రం రైతులకు ప్రతిసారి ఇలాంటి ఇబ్బందులు ఉండొద్దనే గొప్ప ఉద్దేశ్యంతో భూ రికార్డుల ప్రక్షాళన సజావుగా చేయించారని, పనిచేసినందుకు రెవెన్యూ సిబ్బందికి నెల వేతనాన్ని బోనస్ గా ఇచ్చారన్నారు. ఎమ్మార్వోలు, వీఆర్వోలు బాగా పనిచేయడం వల్లే ఈ రోజు రికార్డుల ప్రక్షాళన, రైతుబంధు పథకం విజయవంతమైందని, వీరందరికి ధన్యవాదాలన్నారు. అయితే కొంతమంది ఎమ్మార్వోలు, వీఆర్వోలు తప్పులు చేయడం వల్ల జరిగిన పొరపాట్లను కూడా సరిదిద్దాలన ఇసెం కెసిఆర్ ఇప్పటికే ఆదేశించారని అన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామని చెప్పినా కొంతమంది ఆధార్ కార్డును లింక్ చేసుకోవడానికి ముందుకు రాకపోవడంతో కొన్నిచోట్ల ఇబ్బందుఉల వచ్చాయని అన్నారు. కొంతమంది స్థానికంగా ఉండకపోవడం వల్ల పాస్ పుస్తకాలను తీసుకోవడానికి ముందుకు రావడం లేదని ఇలాంటి కారణాల వల్ల మరికొన్నిచోట్ల స్తబ్దత వచ్చిందన్నారుఎ. ఈ నెల రోజుల్లో ఇలాంటి పొరపాట్లన్ని సరిచేసి జూన్ 22వ తేదీ నాటికి వందశాతం పాస్ పుస్తకాలు, పంట పెట్టుబడి అందించాలని ముఖ్యమంత్రి కేసిఆర్ కలెక్టర్ల సమావేశంలో చెప్పారని అన్నారు. కచ్చితంగా రైతులందరికీ పాస్ పుస్తకాలు, పంట పెట్టుబడి అందుతుందని తెలిపారు. రైతు బంధు పథకం కింద పొరపాట్లు సరిచేయడంలో గ్రామ సభ నిర్వహించి రైతు సమన్వయ సమితి నేతలు, సర్పంచ్, ఎంపీటీసీలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వీఆర్వోలు, ఎమ్మార్వోలు ఎలాంటి తప్పులు చేయకుండా ఈ పథకాన్ని విజయవంతం చేయాలన్నారు. ఇకపోతే ఈ ఏడాది నుంచి రైతు బీమా పథకం అమలు చేసేలా కెసిఆర్ కసరత్తు చేస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ రైతుబీమా పథకాన్ని తీసుకొచ్చారన్నారు. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే ఆ కుటుంబ సభ్యులు రోడ్డున పడకుండా ఉండేందుకు 5 లక్షల రూపాయల బీమాను ఈ పథకం కింద చేస్తున్నారన్నారు. ఇందుకోసం 60 లక్షల మంది రైతులకు ఒక్కో రైతు కోసం ఏటా 2270 రూపాయల ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఈ పథకం రైతులకు చాలా ఉపయోగపడేదని, దీనిని రైతుబంధు కింద లబ్ధి పొందిన ప్రతి రైతుకు అందేలా పనిచేయాలన్నారు.