రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
కరీంనగర్,మే12(జనం సాక్షి ): రైతుసంక్షేమానికి తెరాస ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ అన్నారు. శనివారం ఆయన సైదాపూర్ మండలంలోని ఎలబోతారం, యడ్లాస్‌పూర్ గ్రామాలలో రైతుబంధు పథకం కింద చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో రుణమాఫీ, 24 గంటలపాటు ఉచిత విద్యుత్ సరఫరా, ప్రాజెక్టుల నిర్మాణం వంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తూ దేశంలోనే రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలుపుతున్నారన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు వెంకట్‌రెడ్డి,మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.