రైతు సదస్సులో ఏడీఏపై దాడి
మహబూబ్‌నగర్ :మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో జరుగుతన్న జిల్లా రైతు సదస్సులో ఏడీఏపై దాడి జరిగింది. తిమ్మాజీపేట మాజీ జడ్పీటీసీ దాసురాం ఏడీఏ సోమిరెడ్డి దాడి చేశారు. దాడి ఘటనపై ఏడీఏ కలెక్టర్ గిరిజా శంకర్ ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా రైతులు జడ్పీటీసీ దాసురాంకు మద్దతు పలికారు. ఆయనను అరెస్టు చేస్తే సదస్సు బహిష్కరిస్తామని హెచ్చరించినట్లు సమాచారం.