రైతు సమస్యలపై చిత్తిశుద్ది లేని కెసిఆర్‌

కరీంనగర్‌,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి): కేసీఆర్‌కు నచ్చితే నజరానా లేకుంటే జరిమానా అన్న చందంగా వ్యవహరిస్తున్నాడని బిజేపి కరీంనగర్‌ జిల్లా అద్యక్షుడు కొత్త శ్రీనివాస రెడ్డి విమర్శించారు. నచ్చిన వారికి ఇష్టానుసారంగా కోట్ల నజరానా ఇస్తున్నారని రైతులకు మాత్రం మొండిచేయిస్తున్నాడని మండిపడ్డారు. పథకాల అమలులో కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ధ్వజమెత్తారు. ఉద్యమాలు, పోరాటాల త్వారా ప్రభుత్వం మెడలు వంచి రైతులకు మేలు జరిగే వరకు రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఉద్యమకారులపై భౌతిక దాడులు పాల్పడుతున్నారని దీనిపై తెలంగాణా సమాజం ఆలోచించాలన్నారు.
అలాగే కంది,మిర్చి తదితర పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు.  రైతు రుణమాఫీ అంశం రైతులకు గుదిబండగా మారిందన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నస్టపోయిన రైతులకు కొంత ఊరట కల్పించాలని కేంద్రం కరువు నిధులను  విడుదల చేస్తే పెట్టుబడి రాయితీకింద రైతులను ఆదుకోకుండా నిధులను భోంచేసిందని ఆరోపించారు. 60లక్షల మంది రైతుల పంటల పండిస్తుంటే అందులో 6 లక్షల మందిని భాగస్వాములను కూడా చేయకపోవడం దురదృష్టకరమన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం రైతు సంక్షేమంపై కాస్తా దృష్టిపెట్టి ఉంటే ఈపరిస్థితిలా ఉండేదికాదన్నారు. లక్షా ముప్పై కోట్ల బడ్జెట్‌ పెడుతున్నామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం రుణమాఫీ కింద మొత్తాన్ని ఎందుకు పెంచ లేదన్నారు.