*రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుని మృతి, అవయవదానం చేసిన కుటుంబ సభ్యులు* 

కమ్మర్పల్లి మే ,24 (జనంసాక్షి) కమ్మర్పల్లి మండల కేంద్రంలో గత మూడు రోజుల కిందట స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న యమా సత్యనారాయణ రోడ్డు పక్కన తన స్నేహితునితో మాట్లాడుతుండగా అతి వేగంగా దూసుకొచ్చిన కారు వెనుకనుండి ఢీకొట్టినడంతో తలకి బలమైన గాయంకాగా వెంటనే మెటపల్లి ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స అవసరమని హైదరాబాద్ కు తరలించారు.ప్రమాదంలో తల భాగాన బలమైన గాయం కావడంతో సోమవారం రోజు మధ్యాహ్నం మరణించారని వైద్యులు తెలుపాగా, కుటుంబ సభ్యులు అవయవ దానం చేయాలని నిర్ణయించుకున్నారు. భౌతికంగా లేకపోయినప్పటికీ అవయవ దానం చేయడం ద్వారా  ఇతరుల జీవితాల్లో వెలుగు నింపిన వాళ్ళ0 అవుతామని భావించి అవయవదానం చేశారు మృతునికి , భార్య ఇద్దరు కుమారులు ,ఒక కుమార్తె ఉన్నారు. ప్రమాదానికి కారణమైనటువంటి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.