రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని పరామర్శించిన సిద్దు రావన్

జహీరాబాద్ ఆగస్టు 18 (జనంసాక్షి) జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండలానికి చెందిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని బిఎస్పి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిద్దు రావణ్ ఏరియా ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం మెరుగైన చికిత్స కోసం బీదర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు తెలంగాణ ప్రభుత్వం వైద్యం అందించడంలో విఫలమయ్యారన్నారు. ఆయన వెంట బిఎస్పి నాయకులు తదితరులు ఉన్నారు.