రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్‌ మృతి….

భర్తకు తీవ్రగాయాలు.
ఎల్లారెడ్డిపేమ మే 26 (జనంసాక్షి) : ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి పెట్రోల్‌బంక్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్‌ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ ఎర్ర సువర్ణ(46) మృతి చెందగా ఆమె భర్త ఎర్ర రామాంజనేయులుగౌడ్‌ తీవ్రగాయాలతో ఆసుపత్త్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రాజన్నపేటలో బంధువు మరణించగా ద్విచక్రవాహనంపై మాజీ సర్పంచ్‌ సువర్ణ, ఆమె భర్త రామాంజనేయులుగౌడ్‌ అంత్యక్రియాలకు హాజరై స్వగ్రామానికి వెళుతున్నారు. రహదారి పనుల్లో భాగంగా గొల్లపల్లి పెట్రోల్‌బంక్‌ సమీపంలో వదిలేశారు. ద్విచక్ర వాహనం పైనున్న దంపతులు రోడ్డు వద్ద తమ వాహనం వేగం తగ్గించి నెమ్మదిగా వెళుతుండగా ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న సువర్ణ రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద సంఘటనను గమనించిన స్థానికులు దంపతులిద్దరూ ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్‌ ఆసుపత్త్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు సువర్ణ అప్పటికే మృతి చెందిందని తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ రామాంజనేయులుగౌడ్‌ ఆస్పుత్తిలో చికిత్స పొందుతున్నాడు.