రోడ్డు ప్రమాదంలో 8మందికి గాయాలు
విజయవాడ, ఆగస్టు 2 : కంచికచర్ల వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి ప్రమాదకరంగా ఉండగా వారిని విజయవాడకు తరలించారు. ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో డీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో ప్రయాణికులు గాయపడ్డారు. ఆటో బోల్తాపడటంతో అందులో వారంతా రోడ్డుపై పడిపోవడంతో తలకు కూడా బలమైన గాయలు తగిలాయి. కారును వదిలేసి డ్రైవర్ పరారైయ్యాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా సతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదకరంగా ఉన్న ముగ్గురిని విజయవాడకు తరలించారు.