లండన్స్ ఒలింపిక్స్‌లో నిరాశపర్చిన హై జంపర్ సహానా
లండన్, ఆగస్టు 10 : ఒలంపిక్ క్రీడల్లో భాగంగా భారత్ తరపున బరిలోకి దిగిన హైజంపర్ సహానా కుమారి పూర్తిగా నిరాశపర్చింది. గురువారం జరిగిన మహిళల హైజంప్ క్వాలిఫయింగ్‌లో ఆమె తొలి ప్రయత్నంలో 1.80 మీటర్లు, రెండో ప్రయత్నంలో 1.85 మీటర్లతో మూడో రౌండ్ క్లియర్ చేయలేక 15వ స్థానంతో ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది. జూన్ 23న హైద్రాబాద్‌లో జరిగిన జాతీయ అంతర్ రాష్ట్రీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 1.92 మీటర్లు ఎగిరి, 2004 వ సంవత్సరంలో హైజంప్‌లో కేరళకు చెందిన బాబీ ఆలోయ్సిస్ 1.91 మీటర్ల ఎత్తు రికార్డును అధిగమించిన విషయం తెలిసిందే. అయితే లండన్ ఒలంపిక్స్ గ్రూప్-బిలో టియా హెల్లీ (బెల్జియం), చాంటూలోవి(అమెరికా), స్వెత్లానా(రష్యా), ఇరినాగోర్డివా(రష్యా) 1.93 మీటర్ల ఎత్తుకు ఎగిరి ఫైనల్‌కు అర్హత సాధించగా, సహానా 1.85 మీటర్ల ఎత్తును అధిగమించలేక అభిమానులను నిరాశపర్చింది.