లండన్‌లో విశాలంధ పుస్తకావిష్కరణ

లండన్‌, జూన్‌ 29 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష సరైనది కాదంటూ విశాలాంధ్ర మహాసభ పేరుతో పరకాల ప్రభాకర్‌ అబాద్ధాలను అచ్చేసిన పుస్తకానికి ధీటైన జవాబులిస్తూ ప్రముఖ జర్నలిస్టు ఎన్‌.వేణుగోపాల్‌ రాసిన ‘విశాలాంధ్ర మహా రభస’ పస్తకాన్ని శనివారం లండన్‌లో తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంపై అబద్ధాలు ప్రచారం చేసిన పరకాల ప్రభాకర్‌ అసలు నిజాల జవాబే ఈ పుస్తకం. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రచయిత వేణుగోపాల్‌ మాట్లాడారు. అజ్ఞానుల అసత్య ప్రచారానికి జవాబు చెప్పవద్దు అనుకున్న చరిత్ర పుటలకోసం తప్పనిసరి పరిస్థితుల్లో జవాబు ఇవ్వవలసి వచ్చింందని ఆయన అన్నారు. ఎప్పటికప్పుడు సమాధానాలు చెప్పని కొత్త ప్రశ్నలుగా అనవసర రాద్ధాంతం చేయడం మానుకోవాలని తెలిపారు. టీఈఎన్‌ఎఫ్‌ కోర్‌ మెంబర్‌ ఉదయ్‌ నాగరాజు అధ్యక్షతన జరిగిన సభలో ఈస్ట్‌ లండన్‌ కోఆర్డినేటర్‌ శివాజీ శిండే మాట్లాడుతూ ఎన్ని పుస్తకాలు చదివితే అంత జ్ఞాన సముపార్జాన వస్తుందని తెలిపారు. సాహిత్య ఉద్యమం ఏ పోరాటానికైనా పునాదిలాంటిదని తెలిపారు. ఫౌండర్లు గంప వేణుగోపాల్‌, అనిల్‌ కుర్మాచలం, మహిళా విభాగం ప్రతినిధి అర్చన కోర్‌ మెంబర్లు వెంకట్‌, ప్రమోద, చందుగౌడ్‌ నవీన్‌రెడ్డి తదితరులు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.