లంబాడీల ఐక్యవేదిక నాయకుల ముందస్తు అరెస్టు
కేసముద్రం ఆగస్టు 9 జనం సాక్షి / పోడు భూముల సమస్యను పరిష్కరించాలని సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం ఉన్నందున మంగళవారం అర్ధరాత్రి కేసముద్రం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో లంబాడీల ఐక్యవేదిక జిల్లా కోఆర్డినేటర్ మరియు గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వాంకుడోత్ రవి నాయక్, సేవాలాల్ సేన మండల అధ్యక్షుడు బానోత్ సురేష్, లంబాడీల ఐక్యవేదిక మండల నాయకులు తారాసింగ్ లను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.రవి నాయక్ మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీని తుంగలో తొక్కి పండిస్తున్నటువంటి పంటలను ధ్వంసం చేసి కేసులపాలు చేస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా గిరిజనుల పట్ల మంచి మనసుతో పోడు భూముల సమస్యను తక్షణమే పరిష్కరించారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాను. ప్రభుత్వం ఇలాంటి అరెస్టులతో ఏమి చేయలేదని, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే గిరిజనుల పట్ల మంచి మనసుతో సమస్యను పరిష్కరించి వాళ్ల జీవితాలలో వెలుగును నింపాలని వెల్లడించారు.