లబ్దిదారులకు చెక్కుల పంపిణి

ఎల్లారెడ్డిపేట జూన్‌ 05, (జనంసాక్షి) ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం ఆద్వర్యంలో పశువుల పెంపకానికి మంజురైన చెక్కులను మంగళవారం సహాకార సంఘ చైర్మన్‌ గుండారపు కృష్ణారెడ్డి లబ్దిదారులకు అందిచారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన బస్వాపురం దేవయ్యకు బర్లపెంపకం కోసం 3యూనిట్లకు 3లక్షల రూపాయాలు మంజూరయ్యాయన్నారు. రాగట్లపల్లి గ్రామానికి చెందిన మందాటి దేవయ్యకు గొర్లపెంపకం కోసం 3యూనిట్లకు 2,75,000/-వేల రూపాయాలు మంజూరు కాగా లబ్దిదారులకు చెక్కులను అందించడం జరిగిందన్నారు. సహాకార సంఘాలు రైతుల సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తున్నాయని మంజూరైన ఋణాల ద్వారా రైతులు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కెడిసిసి బ్యాంక్‌ మేనేజర్‌ సుజాత, సొసైటీ డైరెక్టర్లు మార్పు రాజిరెడ్డి, రైతులు నల్లమందు దేవయ్య, సొసైటీ సిఈఓ కిశోర్‌కుమార్‌లు పాల్గొన్నారు.