లారీ ఢీకొని ఒకరి మృతి
పెన్ పహాడ్ . మార్చి 04 (జనం సాక్షి) :వేగంగా వచ్చిన లారీ ఎదురు గా వస్తున్న బైక్ నుఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని వైన్ షాప్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది ,స్థానికులు’ తెలిపిన వివరాల ప్రకారం నెరేడుచర్ల మండలం మేడారం గ్రామానికి చెందిన ఊడుగుంట్ల శ్రీనివాసు (40)తన అత్తగారి గ్రామం పెన్ పహాడ్ వద్ద నివాసం ఉంటూ , పాలకీడు మండలం జాన్ పహాడ్ దర్గా వద్దకు ద్విచక్ర వాహనంపై వెళ్లి వస్తుండగా మరి కొద్దీ సేపట్లో ఇంటికి చేరుకోనుండగా మండల కేంద్రంలోని వైన్ షాప్ వద్ద సూర్యాపేట నుండి ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీ బైక్ ఢీకొనడంతో బలంగా తీవ్ర గాయాలు కావడంతో 108 ద్వారా సూర్యాపేట ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు మృతునికి భార్య నాగమణి ఇద్దురు కుమారుడు ఉన్నారు…