*లింగంపేట్ లో అటల్ బీహార్ వాజ్పేయికి ఘననివాళి

లింగంపేట్ 16 ఆగస్టు (జనంసాక్షి)
లింగంపేట్ మండల కేంద్రంలోని భారతీయజనతా పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బీహార్ వాజ్పేయి 4 వర్ధంతి ఘనంగా నిర్వహించినట్లు బిజేపి మండల అద్యక్షుడు జక్సాని దత్తురాములు తెలిపారు.అటల్ బీహర్ వాజ్పే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు దేశం కోసం ధర్మం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహా గొప్ప వ్యక్తి అటల్జీ అన్నారు.జాతీయవాదమే తన ఊపిరిగా అందరి మన్ననలు పొందిన గొప్ప వ్యక్తి అటల్జీ అన్నారు.ఆయన చూపిన బాటలో నేటి తరం నడవాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కిసాన్ మోర్చా ఉపాద్యక్షులు బొల్లారం సాయిలు,బిజిపి నాయకులు సుభాష్,ఉదేశ్ కుమార్,మంగళి,నవీన్,మోతిరాం నాయక్ మ్యాదరి ప్రసాద్,శ్రీకాంత్,అల్లూరి,మ్యదరి ప్రసాద్,శ్రీకాంత్,అనిల్,భాస్కర్ పవన్ కార్యకర్తలు పాల్గొన్నారు.