లోకేష్‌ను పార్టీలోకి తిసుకొచ్చే విషయంలో వెనక్కి తగ్గిన టీడీపీ

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీలో టీడీపీ అధినేత చంద్రబాబు తనయడు లోకేష్‌ను పార్టీలోకి తీసుకురావాలని పార్టీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు విన్నవించారు. రాజకీయా ఆరంగేట్రంపై జోరుగా ప్రచారం జరిగిన విషయం పార్టీలో చర్చనీయంశం అయింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ నేతలు కూడా లోకేష్‌కు తెలుగు యువత అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబుకు లేఖ ఇచ్చి విజ్ఞప్తి చేశారు. సోమావారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన జూనియర్‌ ఎన్టీఆర్‌ నానీ పార్టీని వదిలిన విషయాన్ని ప్రస్తావిస్తు నేను మాత్రం పార్టీ బతికున్నంతవరకు  టీడీపీతోనే ఉంటానని ఆయన కరకండిగా చెప్పాడు దీనితో తెదేపాలో లోకేష్‌ను ఇప్పుడు తీసుకురావద్దని మరింత అసంతృప్తి చెలరేగుతుందని. ఇలాంటి పరిస్థితుల్లో ఏమి మాట్లాడకుండా ఉండటమే మంచిదని అనుకుంటున్నారు. ఇప్పటికే కొడాలి నానీ తర్వాత వల్లభనేని వంశీ కూడా జగన్‌వైపు వెళ్ళడానికి సిద్దంగా ఉన్నాడనే ప్రచారం జరుగుతుంది. నానీని జగన్‌పార్టీలోకి తీసుకువచ్చిన వంగవీటి రాధాకృష్ణ ఇప్పుడు వంశీని కూడా పార్టీలోకి తీసుకు రావటానికి రంగంలోకి దిగినట్లు  సమాచారం. జూనియర్‌ ఎన్టీఆర్‌ వర్గీయులు నివురు గప్పిన నిప్పులా ఉన్నారని లోకేష్‌ పేరు తెరపైకి తెచ్చి వారిని మరింత రెచ్చగోట్టక పోవటమే మంచిదని వారు అభిప్రాయానికి వచ్చారు.