లోక్‌సభ ఎన్నికలకు విశేశస్పందన
` తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్
` భద్రత మధ్య ఈవీఎంల తరలింపు
` రాష్ట్రవ్యాప్తంగా 38 కేసులు నమోదు
` సీఈవో వికాస్‌రాజ్
` తుది ఓటింగ్ శాతంపై నేడు స్పష్టత వస్తుందని వెల్లడి
హైదరాబాద్(జనంసాక్షి):రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని సీఈవో వికాస్‌రాజ్ పేర్కొన్నారు. తుది ఓటింగ్ శాతం అనే వివరాలను రేపు వెల్లడిస్తామని తెలియజేశారు. ఇవాళ వివిధ కారణాలపై 38 కేసులు నమోదు చేసినట్లుగా తెలిపారు.: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించినట్లుగా తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ వెల్లడిరచారు. ఈ సందర్భంగా విూడియాతో మాట్లాడిన వికాస్‌రాజ్, రాష్ట్రంలో పోలింగ్ శాతం బాగానే నమోదైందని పేర్కొన్నారు. తుది ఓటింగ్ శాతం ఎంత అనేది రేపు వెల్లడిస్తామని తెలిపారు. ఇవాళ వివిధ కారణాలపై 38 కేసులు నమోదు చేశామని వివరించారు. జీపీఎస్ ఉన్న వాహనాల్లో ఈవీఎంలు తరలిస్తామన్నారు.ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి రూ.330 కోట్లు సొత్తు స్వాధీనం చేసుకున్నట్లుగా వికాస్‌రాజ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14 వందల కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోందని వెల్లడిరచారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాట్లు చేసినట్లుగా వివరించారు. ఈవీఎంలు తెల్లవారుజాము వరకు స్ట్రాంగ్ రూమ్‌లకు చేరతాయని తెలిపారు. కచ్చితమైన పోలింగ్ శాతం రేపు మధ్యాహ్నం వరకు తెలుస్తుందన్నారు. పోలింగ్‌పై మంగళవారం స్క్రూటినీ ఉంటుందని, ఎక్కడైనా రీ`పోలింగ్ అవసరమైతే రేపు తెలుస్తుందని వివరించారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల లోపు క్యూలో ఉన్నవారికి అధికారులు ఓటువేసే అవకాశం కల్పించారు. క్యూలో నిలబడిన వారు పూర్తయ్యే వరకు పొలింగ్ కొనసాగింది. ఎన్నికల అధికారులు ఇప్పటికే ఈవీఎంలను సీజ్? చేశారు. పోలింగ్? కేంద్రాల నుంచి ఈవీఎంలను తరలించే ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఎన్నికలు విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ ధన్యవాదాలు తెలియజేశారు.రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో యువత, సినీ, రాజకీయ ప్రముఖులు ఉత్సాహాంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద సందడి కనిపించింది. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. మావోయిస్టు ప్రాభల్యమున్న ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది.