లోతట్టు ప్రాంత గ్రామాలను సందర్శించిన టిఆర్ఎస్ నాయకులు

పినపాక నియోజకవర్గం జులై 14 (జనం సాక్షి): వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మండలం లోని ఐదు గ్రామాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు వెళ్లాలని జడ్పిటిసి పోశం నరసింహారావు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకీ వరద ఉధృతి పెరుగుతున్న కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు పశువులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. గోదావరి పరిసర ప్రాంత గ్రామాలైన కమలాపురం, అన్నారం, చిన్నరాయిగూడెం, కొండాయిగూడెం ఇళ్లల్లోకి వరద నీరు చేరుతోంది. ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి పెరిగే అవకాశం ఉన్నందున ప్రమాదం జరగకుండా ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమములో జెడ్పిటిసి పోశం నరసింహారావు, పిఎసిఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు,  అడపా అప్పారావు, యాదగిరి గౌడ్, ముత్యం బాబు, టిఆర్ఎస్ నాయకులు  తదితరులు పాల్గొన్నారు.