వరంగల్‌లో విద్యార్థి సంఘాల ఆందోళన
వరంగల్: తెలంగాణపై ఆజాద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వరంగల్ ఆర్టీసీ బస్టాండ్‌లో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు.