వరంగల్ ఓ సిటీ లో వెలసిన పోచమ్మ విగ్రహం
– భక్తిశ్రద్ధలతో మహిళల బోనాలు ..
-భక్తుల విశేష పూజలు
వరంగల్ ఈస్ట్,ఆగస్టు 17(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని ఓ సిటీ లో లాగే లాగే ఫోటో పెట్టనా ఇండోర్ స్టేడియం లో బుధవారం ఉదయం పోచమ్మ తల్లి విగ్రహం వెలిసింది దీంతో స్థానికుల తో పాటు వరంగల్ నగరంలోని ప్రజలు తండోపతండాలుగా స్టేడియం వచ్చి పోచమ్మ తల్లి ని దర్శించుకున్నారు. అలాగే కొబ్బరి కాయలు కొట్టి వేసి పూజలు నిర్వహించారు .అంతేకాకుండా పోచమ్మ బోనాల తో సహా మహిళలు పిల్లలు పెద్దలు అన్ని వర్గాల ప్రజలు పూజలు నిర్వహించారు. స్టేడియంలో పోచమ్మ విగ్రహం వెలవడం తో అక్కడి ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది. ఈ సంఘటన విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ హరి సింగ్ తో పాటు వరంగల్ ఏసిపి కలకోట గిరి కుమార్ పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. ఇక్కడే ఓ వర్గానికి చెందిన వారితో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నకారణంగా స్టేడియం లో ఎవరు రావద్దు అని చెప్పి పోలీసులు స్టేడియం గేట్ లాక్ బ్లాక్ చేశారు. ఈ క్రమంలో స్టేడియం లోపలికి ఎవరు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రెండు వర్గాలకు సంబంధించిన స్టేడియంలోని విపత్కర పరిస్థితుల వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోచమ్మ విగ్రహం వెలువడడంతో ఓ సిటీలోని ఓ సిటీ అధ్యక్షులు జోగు చంద్రశేఖర్, కుమార్, ప్రభాకర్, ప్రభాకర్ ,సాంబయ్య, రంజిత్, నాగరాజు, పవన్ తదితరులు పూజలు నిర్వహించారు.