వరంగల్ కిక్ బాక్సర్ కు ఆర్థిక సాయం

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 17(జనం సాక్షి):
వాకో ఇండియా నేషనల్ సీనియర్స్ అండ్ మాస్టర్స్ కిక్ బాక్సింగ్ ఛాంపియిన్ షిప్ ఎంపికైన వరంగల్ కిక్ బాక్సర్ అన్వేష్ కు ఆర్ధిక సహాయం అందించిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు.
గతంలో కిక్ బాక్సింగ్ క్రీడలో పలు రాష్ట్ర జాతీయ స్థాయిలో బంగారు పతకాలు చాపియన్ షిప్ లు సాధించిన వరంగల్ ఆణిముత్యం ఎడ్ల అన్వేష్ చెన్నై లో ఈనెల 18 నుండి ప్రారంభమయ్యే వాకో ఇండియా నేషనల్ సీనియర్స్ అండ్ మాస్టర్స్ కిక్ బాక్సింగ్ ఛాంపియిన్ షిప్ నకు ఎంపికైన సందర్బంగా క్రీడాకారునికి ఆర్ధికంగా Rs.5,000/- శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానము ట్రస్ట్ బోర్డు సహాయం చేయడం జరిగింది. నేడు దేవస్థానంలో క్రీడాకారునికి ఇట్టి ఆర్ధిక సహాయం అంద జేశారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ అప్పరాజు రాజు ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమం జరిగింది.
చైర్మన్ అప్పరాజు రాజు మాట్లాడుతూ దేవాలయాలు భక్తితో మెరవాలి సమాజ సేవలో మురవాలి అన్న ఏకైక లక్ష్యంతో అత్యుత్తమ ప్రదర్శనతో రాణిస్తున్న ఎడ్ల అన్వేష్ కు మంచి భవిష్యత్ ఉన్నదనియు,క్రీడాకారునికి అవసరముండడం గమనించి తక్షణమే రూ.5,000/- ఇచ్చినాము అన్నారు. ఈ సందర్బంగా కిక్ బాక్సర్ ఎడ్ల అన్వేష్ మాట్లాడుతూ ఈ ఛాంపియన్ షిప్ సాధించడం ద్వారా అంతర్జాతీయ పోటీల్లో భారత దేశం తరపున పాల్గొనే అవకాశం ఉందని అందుకే ఈ ఛాంపియన్ షిప్ ప్రముఖ్యాన్ని గమనించి ట్రస్ట్ బోర్డు స్పందించి ఆర్ధికంగా సహాయం చేయడంతో హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియ జెస్తున్నానని అన్నారు.
ఈ కార్యక్రమంలో,ట్రస్ట్ బోర్డు సభ్యులు చిట్టిమళ్ళ సురేష్, కటకం రాములు, పప్పుల మంజుల, గంగిశెట్టి హరినాథ్ ఆలయ ముఖ్య అర్చకులు శ్రీ తనుగుల రత్నాకర్ అయ్యగారు ఈఓ వెంకట్రావు స్థానిక భక్తులు పాల్గొన్నారు.