వరంగల్ లో భారీ త్రివర్ణ పతాకం తో ర్యాలీ..
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 22(జనం సాక్షి)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 15 రోజులపాటు చేపట్టిన స్వాతంత్ర్య భారత 75 వ వజ్రోత్సవాల ముగింపు లో భాగంగా వరంగల్ తూర్పు శాసన సభ్యులు నన్నపునేని నరేందర్ గారి ఆధ్వర్యంలో ఖిలా వరంగల్ వాకింగ్ గ్రౌండ్ లో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది,అనంతరం పోచమ్మ మైదాన్ సెంటర్ లో దాదాపు 2 కిలోమీటర్ల పోడవైన భారీ త్రివర్ణ పాతాకం తో భారీ ర్యాలీ నిర్వహించారు,ఆర్పీలు, మహిళా సంఘాలు, విద్యార్థినీలు, అంగన్వాడీ, ఆశ వర్కర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు,పోచమ్మ మైదాన సెంటర్ అంతా త్రివర్ణ మయం అయ్యింది,
ఈ సందర్బంగాఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటం లో అమరులైన ఉద్యమకారులను, వారి త్యాగాలను స్మరించుకున్నారు,మైనారిటీ రెసిడెన్సియల్ గర్ల్స్ -2 పాఠశాల ప్రిన్సిపాల్ పేర్ని మాధవి ముగ్గుల పోటీ లకు న్యాయ నిర్నెత గా వ్యవహిరంచి ముగ్గుల పోటీ లలో గెలుపొందిన విజేత లను ఎంపిక చేశారు,విజేతల కు ప్రధమ, ద్వితీయ, తృతీయ కన్సలేషన్ బహుమతులు ఎమ్మెల్యే నరేందర్ గారు అందించారు, అభినందించారు.
కార్యక్రమం లో డిప్యూటీ మేయర్ రిజ్వన శమీమ్ ,డివిజన్ కార్పోరేటర్ సురేష్ జోషి,వివిధ డివిజన్ల కార్పొరేటర్ లు మెప్మా పీడీ రేణుక,సి. ఓ లు రమేష్, ప్రవీణ్ ఆర్పీ లు, ఆశ కార్యకర్తలు, విద్యార్థులు, ముఖ్య నాయకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.