వరంగల్ లో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు
– ఆకట్టుకున్న కృష్ణుడు గోపికల వేషధారణలు
– అలరించిన నృత్యా రూపకాలు
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 19(జనం సాక్షి)
వరంగల్ నగరంలో శుక్రవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలతో పాటు వివిధ ప్రాంతాల్లోని పలు స్వచ్ఛంద సేవా సంస్థలు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేవతామూర్తి లైన శ్రీకృష్ణుడు గోపికల వేషధారణతో విద్యార్థులు స్థానికులను అలరించారు. సాక్షాత్తు దేవతలే దిగి వచ్చినట్లు వేషాలు ధరించి విద్యార్థులు తమ ఆటపాటలతో ప్రదర్శన ఇచ్చారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు అందించేలా విద్యార్థులు తమ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఆయా పాఠశాలల యాజమాన్యాలు స్వచ్ఛంద సేవా సంస్థలు తమ ఆటపాటలలో మంచి ప్రదర్శన ఇచ్చిన విద్యార్థులకు బహుమతులు అందించే ప్రోత్సహించారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణుని జన్మ వృత్తాంతాన్ని తెలిపే పలు నాటక ప్రదర్శనలు, నృత్య రూపకాలు కూడా అందర్నీ ఆకట్టుకున్నాయి