వరద కాలువలో నీటిని నిల్వ ఉంచకపోతే ఆత్మహత్యలే శరణ్యం
మెట్‌పల్లి: వరద కాలువ కోసం భూములు పోగొట్టుకున్నాం, ప్రస్తుతం మాన్పూరు వాగులోని నీటిని వదిలి వేస్తే తమకు ఆత్మహత్యలే గతి అని పలు గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. జగ్గాసాగర్ వివారులోని మాన్పూరు వాగును ఎస్‌ఆర్‌ఎస్పీ సీఈ ఎల్లారెడ్డి, ఎస్‌ఈ నర్శింగరావులు పరిశీలించారు. రైతులు వరద కాల్వలో నీటిని నిల్వఉంచి తమను ఆదుకోవాలని అధికారులను విన్నవించారు. ఎక్కింపూర్ తూము ద్వారా నీటిని వదిలితే తాము ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.